కవికోకిల గుఱ్ఱం జాషువా
పరాయి పాలనలో మ్రగ్గుతూ ఉండిన భారతావనిలో అన్ని రంగాల్లోనూ కారుచీకట్లు కమ్ముకున్న కాలమది. సవర్ణ హిందూవులచేత వెలివేయబడిన నిమ్నజాతుల వారికోసం విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని నెలకొల్పి మిషనరీలు ఆ అమాయకులను క్రైస్తవానికి ఆకర్షిస్తూ ఉండిన రోజులవి. గుంటూరులోని లూథరన్ మిషన్, వినుకొండలోని బాప్టిస్టుమిషన్...



