తేనెలొలికే పలుకుల ‘చిలక’మర్తి లక్ష్మీనరసింహం
"భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు. పితుకుచున్నారు మూతులు బిగియగట్టి". భారతీయులను అనేక బాధలకు, అవమానాలకు గురిచేస్తున్న ఆంగ్లేయుల దౌర్జన్యాలనూ, కుటిల రాజనీతిజ్ఞతనూ, దోపిడీ విధానాలను తీవ్రంగా దుయ్యబడుతూ బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరంలో 5...
