
898views
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లోనూ దేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ‘సముద్ర సేతు’ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్ జలాశ్వ, ఐఎన్‌ఎస్ మఘర్ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు వెల్లడించాయి. తొలివిడతగా గర్భిణులు, చిన్న పిల్లలకు ప్రాధాన్యం ఇస్తూ వెయ్యి మందిని దేశానికి తీసుకొస్తునట్టు పేర్కొన్నాయి.






