News

నందిగామలో ఎస్సీ రిజర్వేషన్లపై వినతిపత్రం

6views

నందిగామ : క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపుపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఎస్సీ/ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో  ఎన్టీఆర్  జిల్లా  నందిగామ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

రథం సెంటర్‌ నుంచి వేదిక ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు సామూహికంగా నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎస్. ఇలక్కియా, ఐఏఎస్, అలాగే ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్‌ను రద్దు చేసి, తమ డిమాండ్లకు అనుగుణంగా బీసీ-సి కేటగిరీలో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని వేదిక ప్రతినిధులు వినతిపత్రంలో కోరారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు, రాజ్యాంగపరమైన నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శ్రీ మార్కండేశ్వరరావు, జిల్లా ధర్మ ప్రచారక్ శ్రీ జై శంకర్, జిల్లా బాలవికాస్ ప్రతినిధి శ్రీ హనుమంతు, జగ్గయ్యపేట మండల కన్వీనర్ శ్రీ వెంకట నరసయ్య, గోసంరక్షణ ప్రముఖ్ శ్రీ వందేమాతరం అశోక్ పాల్గొన్నారు.

అలాగే పట్టణ పెద్దలు శ్రీ సీతారామయ్య, శ్రీ సాయి, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తదితరులు కార్యక్రమానికి హాజరై అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.