News

తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

8views

తమిళనాడులో మళ్లీ ‘‘సనాతన ధర్మం’’పై వివాదం చెలరేగింది. రాష్ట్రంలో పెరియార్ ఈవీ రామసామి జయంతి సందర్భంగా సామాజిక న్యాయశాఖ మంత్రి, విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) సీనియర్ నేత వన్ని అరసు మాట్లాడుతూ.. ‘‘పెరియార్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు’’ అని అన్నారు.‘‘సనాతన ధర్మం విషయంలో పెరియార్ ఎలాంటి రాజీకి సిద్ధంగా ఉండేవారు కాదు, సనాతన ధర్మం నుంచి తమిళనాడును రక్షించేందుకు తమ పార్టీ ప్రతిజ్ఞ చేస్తుంది’’ అని వన్ని అరసు వ్యాఖ్యానించారు. విజయ్ టీవీకే ప్రభుత్వంలో వీకేసీ ప్రధాన భాగస్వామిగా ఉంది.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత నారాయణన్ తిరుపతి తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాలు, చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని అన్నారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని, వన్ని అరసు వ్యాఖ్యలపై సీఎం విజయ్ స్పందించాలని డిమాండ్ చేవారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే, హిందూ మతాన్ని వ్యతిరేకించే వర్గాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని భావించాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు.