
15views
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఆర్జేడీ ఎంపీ పప్పూ యాదవ్ కాషాయ వస్త్రాుల ధరించి, అయోధ్య విరాళాల అవకతవకలపై నిరసన తెలపడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిని సనాతన ధర్మం, పూజ్యనీయులైన సాధువులు, సంత్‌లు, అలాగే యావత్ హిందూ సమాజపు మతపరమైన భావనలను అవమానించే చర్యగా VHP అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ మండిపడ్డారు. ఇదో నీచమైన రాజకీయ చర్య అని దుయ్యబట్టారు.
రావణుడు మోసం చేయడానికి ముని వేషం వేసుకున్నట్లే, ఈ రాజకీయ నాయకులు కూడా అదే చేస్తున్నారు” అని మండిపడ్డారు.మతపరమైన చిహ్నాలను దుర్వినియోగం చేయడం ద్వారా సనాతన విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
“రావణుడు కపట చర్యలకు పాల్పడేందుకు ముని వేషధారణను ఎలాగైతే ఆశ్రయించాడో, అలాగే ఈ ప్రతిపక్ష నాయకులు మతపరమైన చిహ్నాలను దుర్వినియోగం చేస్తూ హిందూ విశ్వాసంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణం విషయంలో అడ్డంకులు సృష్టించడం మొదలుకొని నేటి వరకు, వారి హిందూ వ్యతిరేక వైఖరి అందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆ అద్భుతమైన రామమందిర నిర్మాణం తర్వాత కలిగిన తీవ్ర నిరాశతోనే ఇదంతా చేస్తున్నారు.” అని అన్నారు.
హిందూ సమాజం అత్యంత సహనశీలమైనదని డాక్టర్ జైన్ పేర్కొన్నారు; అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ సహనాన్ని పరీక్షించకూడదని, అలాగే భాషాపరమైన, రాజ్యాంగపరమైన హద్దులను దాటేలా దానిని బలవంతం చేయకూడదని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేతలకు నిజంగా దమ్ముంటే.. ఇతర మతాలకు చెందిన మత పెద్దలు లేదా మత గురువుల వేషధారణలో ఉంటూ ఆయా మతాల చిహ్నాలను ఎగతాళి చేసి చూడాలని అన్నారు. వారు అలా చేసిన మరుక్షణమే వీధుల్లో హింసాత్మక నిరసనలు చెలరేగుతాయని, దాంతో వారు కనీసం బయట అడుగు పెట్టడం కూడా కష్టమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అయోధ్య రామ మందిర విరాళాల అవకతవకలపై సభలో చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఎంపీ, కాంగ్రెస్ మద్దతుదారు పప్పు యాదవ్.. కాషాయ వస్త్రాలు ధరించి కూర్చొన్నారు. ఆయన ముందు ఓ టేబుల్ వేసి దానిపై హుండీ పెట్టారు. ఆ టేబుల్‌కు అటు ఇటు మరో రెండు హుండీలు ఏర్పాటు చేశారు. పప్పు యాదవ్ పక్కన ఓ మహిళా ఎంపీ కూడా కూర్చొని ఉన్నారు. వారి చుట్టూ చాలా మంది నిలబడి ఉన్నారు. అంతలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. పప్పు యాదవ్ వద్దకు వచ్చి నమస్కరించి.. ఆ హుండిలో నగదు వేశారు. ఆ తర్వాత పలువురు ఎంపీలు.. ఆ హుండీలో నగదు వేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(Source: Panchjanya.com)





