News

ఉద్రేకాలు కావు… వివేకమే దేశానికి శ్రీరామరక్ష

23views
– త్రిలోక్
​ఒకసారి ఏదో ఒక ఆందోళన లేదా నిరసన ద్వారా తక్షణ ఫలితం రావచ్చు. అంతమాత్రాన ప్రతీసారి అదే పద్ధతి సఫలం అవుతుందని అనుకోవడం పొరపాటు. ఇంట్లో ఎంత రక్షణ ఉన్నా, ఎప్పుడో ఒకసారి దొంగతనం జరగొచ్చు… కానీ అంతమాత్రాన ఇల్లే సురక్షితంగా లేదని భావించలేము కదా! ​అలాగే, సిజెపి పార్టీ చేస్తున్న ఉద్రిక్త ఆందోళనల ద్వారా వాళ్ళ డిమాండ్లు నెరవేరాయి కాబట్టి వాటిని చూసుకొని విర్రవీగిపోవడం సరైంది కాదు. బెదిరింపులు, భయాందోళనలు లేదా అరాచక మార్గాల ద్వారా సాధించే విజయాలు ఎప్పటికీ నిలబడవు. ఈ దేశపు చట్టం, ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు భారతీయ సమాజం ఇలాంటి హింసాత్మక మార్గాలను ఎప్పటికీ ఆమోదించవు అంగీకరించవు
​వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులలో, కొద్దిమంది భావోద్వేగాలకు లోనై రాజకీయ స్వార్థపరుల లేదా అదృశ్య శక్తుల బ్రెయిన్‌వాష్‌కు బలికావచ్చు. కానీ దేశంలో ఉన్న లక్షలాది మంది యువకులు, విద్యార్థులు ఎప్పుడూ దేశభక్తితోనే ఉన్నారు.పక్క దేశాల్లో జరిగే సైనిక తిరుగుబాట్లు లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చే కుట్రలు భారతీయ నేల మీద ఎప్పటికీ సాధ్యం కావు.
అశాంతిని, హింసను ప్రేరేపించే పద్ధతులు మన భారతీయ సంస్కృతికి మరియు మన యువత ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధం ఈ దేశపు యువతకు స్వామి వివేకానంద నుండి మొదలుకొని అబ్దుల్ కలాం వంటి వారిని ఆదర్శం గా తీసుకుంటారు మన ఇతిహాసాలు మనకు నేర్పిన పాఠం ఒకటే — అధర్మం ఎంత ఆర్భాటం చేసినా, గెలుపు మాత్రం ధర్మానిదే!
మహాభారతంలో జూదంలో పాండవులు తాత్కాలికంగా ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అంతిమ విజయం ధర్మానిదే అయింది.​రామాయణంలో రావణుడు దొంగచాటుగా సీతను ఎత్తుకెళ్లినంత మాత్రాన రాముడు శక్తిహీనుడు కాలేదు. చివరకు లంకలో ధర్మమే గెలిచింది, రావణాసురుడి అహంకారం బూడిదైంది.సిజెపి అరాచకాల వల్ల తాత్కాలికంగా అన్యాయం గెలిచినట్లు అనిపించినా, శాశ్వతంగా ధర్మం ఓడిపోయినట్లు కాదు.
​అణచివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఇచ్చింది. కానీ ఆ నిరసన తెలిపే పద్ధతి సరైనదై ఉండాలి. ప్రజాస్వామ్య పరిధి దాటితే అది నిరసన కాదు… నేరం!
​చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, రాళ్లు రువ్వడం, ప్రజా ఆస్తులను (బస్సులు, రైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు) ధ్వంసం చేయడం నిరసన అనిపించుకోదు.
రాజకీయనాయకులపై, మహిళలపై జుగుప్సాకరమైన భాష ఉపయోగించడం భారతీయ సంస్కృతి కాదు.
​ప్రజా ఆస్తులు అంటే ఏ ఒక వ్యక్తి వి కావు… మన కష్టార్జితం నుంచి కట్టిన పన్నుల డబ్బు! వాటిని తగలబెట్టడం అంటే మన ఇల్లు మనమే కాల్చుకోవడమే.నాయకులకు, ఇన్ఫ్లుయెన్సర్లు సమాజాన్ని ప్రభావితం చేసే మేధావులు, మరియు రాజకీయ నాయకులు ఎలాంటి సందేశాన్ని యువతకు ఇస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.
​యువత చేతుల్లో పట్టుకోవాల్సింది పుస్తకాలు, సాంకేతికత, దేశాన్ని నడిపించే ప్రాజెక్టులు… రాళ్లు, పెట్రోల్ బాంబులు కావు.రాజకీయ ప్రయోజనాల కోసం కుర్రాళ్ళ భవిష్యత్తును బలిచేసే అరాచక మార్గాలను ప్రోత్సహించేవారిని సమాజం ఎప్పటికీ క్షమించదు, ప్రశ్నిస్తూనే ఉంటుంది.
“తాత్కాలిక ఉద్రేకాలు, ఉచిత ప్రచారాలు దేశాన్ని నిర్మించలేవు. శాంతి, క్రమశిక్షణ, కష్టం మాత్రమే భవిష్యత్తును నిర్మిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమాజ హితం కోసం పనిచేద్దాం. దేశ యువత మేల్కొని నిజమైన ధర్మాన్ని, ప్రజాస్వామ్య న్యాయాన్ని కాపాడుకోవాలి!”