
3views
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టు 15 వేల బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అంతేకాకుండా సెప్టెంబర్ 19 న కోర్టుకు స్వయంగా హాజరు కావాలని కూడా ఆదేశించింది. ఒకవేళ సరైన కారణం లేకుండా కోర్టుకు హాజరుకాని పక్షంలో ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది.
అత్యంత శ్రద్ధాసక్తులతో, దేశ భక్తి కోసం పనిచేసే బజరంగ్ దళ్ సంస్థను ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన PFI తో ఖర్గే పోల్చారు. 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖర్గే ఈ విధంగా చేశారు.
ఈ విషయంపై VHP జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ స్పందించారు. ‘‘జాతీయవాద సంస్థలను నిందించడం, ఉగ్రవాదులతో పోల్చడం కాంగ్రెస్ వికృత మనస్తత్వానికి నిదర్శనం. ప్రజల నుంచి పదే పదే తిరస్కరణకు గురైనా.. రాజకీయంగా నానాటికీ ప్రాధాన్యం కోల్పోతున్నా.. కాంగ్రెస్ ఏమాత్రం సిగ్గుపడటం లేదు’’ అంటూ విరుచుకుపడ్డారు.
ఈ వివాదం ఎప్పుడు మొదలైంది?
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వివాదం మొదలైంది. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో, ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న నిషేధిత సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో బజరంగ్ దళ్‌ను పోల్చుతూ, దానిని నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే చేసిన ఒక ప్రకటన తరువాత, అనేక సామాజిక, మత సంస్థలు ఆ వ్యాఖ్యను వ్యతిరేకించాయి. ఈ పోలిక బజరంగ్ దళ్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని, దాని సభ్యుల మతపరమైన మనోభావాలను గాయపరుస్తుందని వారు వాదించారు.
ఈ వివాదం నేపథ్యంలో, పంజాబ్‌లోని సంగ్రూర్ నివాసి మరియు బజరంగ్ దళ్ కార్యకర్త అయిన హితేష్ భరద్వాజ్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ ప్రకటన సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించిందని, అలాగే సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదాన్ని సృష్టించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రారంభంలో, ఈ కేసు సివిల్ స్వభావం కలిగిందిగా కోర్టు పరిగణించింది. కానీ.. వాస్తవాలను ఆధారంగా చేసుకొని, దీనిని న్యాయస్థానం క్రిమినల్ కేసుగా పరిగణించి, తదుపరి విచారణను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా, కాంగ్రెస్ అధ్యక్షుడిపై బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసిన న్యాయస్థానం, వ్యక్తిగతంగా హాజరయ్యేలా చూడాలని ఆదేశించింది.





