News

సంస్కృత భాషలోని వైజ్ఞానిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

44views

తిరుపతి: భారతీయ సంస్కృతి, జ్ఞాన సంపదకు మూలమైన సంస్కృత భాషను అభ్యసించి, అందులో నిక్షిప్తమైన వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య పిలుపునిచ్చారు.

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్, శ్రీ పట్టాభిరామ శాస్త్రి వ్యాఖ్యానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంస్కృత భాష పరిరక్షణ, ప్రచారం, అభివృద్ధి కోసం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.

సంస్కృతం కేవలం ప్రాచీన భాష మాత్రమే కాకుండా, భారతీయ తత్వశాస్త్రం, వేదాలు, శాస్త్రాలు, విజ్ఞాన సంపదకు ఆధారమైన దివ్య భాష అని పేర్కొన్నారు. విద్యార్థులు సంస్కృత భాషను లోతుగా అధ్యయనం చేసి, అందులోని అమూల్యమైన జ్ఞానాన్ని గ్రహించి సమాజాభివృద్ధికి వినియోగించాలని సూచించారు.

భారతీయ జ్ఞాన పరంపరను భావితరాలకు అందించడంలో సంస్కృత భాష కీలక పాత్ర పోషిస్తోందని, ఈ దిశగా విద్యాసంస్థలు మరింత కృషి చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు.