News

హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహావిష్కరణ

60views

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. శివాజీ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు చలపతి, వానరసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం జరిగిన సభలో భారతీయ సంస్కృతి ప్రచారకర్త కమలనంద భారతీ స్వామీజీ, శివసాయిబాబా, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ సుస్థిర పాలన, దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణ, ప్రజాసేవకు ఆదర్శప్రాయుడని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకోగా, అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా అదనపు ఎస్పీ మహేష్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.