News

ఆలయాల్లో రద్దీని నియంత్రించండి : దేవదాయ శాఖ

181views

మహాశివరాత్రి, కార్తీకమాసంతోపాటు ఇతర పర్వ, పవిత్ర దినాల్లో దేవాలయాల్లో భక్తుల రద్దీ నియంత్రణపై దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని బుధవారం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు పంపించారు. కార్తీక మాసం, ఆదివారం, సోమవారం, పౌర్ణమి, ఏకాదశి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఈ రద్దీ నియంత్రణతోపాటు త్వరగాదర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.