News

నలుగురు మావోయిస్టు సభ్యులు లొంగుబాటు…

232views

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్థర్ ఎదుట నలుగురు మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.ఛత్తీస్‌గఢ్ కి చెందిన ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు మావోయిస్టు దళ సభ్యులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గడ్ రాష్ట్రాలలో వరుసగా జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని మావోయిస్టు దళ సభ్యులు వరుసగా లొంగిపోతున్నారని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాలలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు ముఖ్యనేతలు కోల్పోవడంతో పుంజుకొనే పరిస్థితి లేక స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని అన్నారు. మావోయిస్టుల ప్రలోభాలకు గురికావద్దని స్వచ్ఛందంగా స్వేచ్ఛగా జీవించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆకర్షితులవుతున్నారని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలిపారు.