News

తిరుమల తరహాలో శ్రీశైలంలో సౌకర్యాలు

236views

శ్రీశైల క్షేత్రంలో తిరుమల తరహాలో సౌకర్యాలు కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. పరిపాలనా భవనంలో గురువారం ఛైర్మన్‌ రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈవో ఎం.శ్రీనివాసరావు 42 అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు. 39 అంశాలకు ఆమోదం తెలిపారు.

  • భక్తుల సౌకర్యార్థం టీటీడీ తరహాలో పీఏసీ-5 తరహాలో పబ్లిక్‌ అమినిటీస్‌ కాంప్లెక్స్‌. బీవోటీ (బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో పబ్లిక్‌ టాయిలెట్స్, స్నానపు గదులు నిర్మించాలని నిర్ణయించారు.
  • శని, ఆది, సోమవారాలు, సెలవులో భక్తులకు ఉదయం, రాత్రి మాత్రమే రెండు విడతలుగా స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు.
  • మల్లికార్జునస్వామి గర్భాలయంలో రుద్రాక్ష మండపానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయించారు.
  • సీప్లేన్‌ కార్యకలాపాల కోసం ఏరోడ్రోమ్‌ టెర్మినల్‌ భవన నిర్మాణానికి 1.06 సెంట్ల స్థలాన్ని కేటాయించాలి.
  • తామ్రశాసనాల వివరణ, విశ్లేషణలను గ్రంథరూపంలో ముద్రించాలని నిర్ణయించారు.