News

ఇంట్లో నమాజ్ చేసుకుంటున్న వ్యక్తుల అరెస్టు వైరల్ వీడియో.. అసలు నిజం ఇదే

264views

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో, ఒక ప్రైవేట్ ఖాళీ ఇంట్లో శుక్రవారం జుమ్మా నమాజ్ చేసినందుకు పోలీసులు 12 మంది ముస్లిం వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సంఘటన జనవరి 16న బిష్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్‌గంజ్ గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

“బరేలీలోని ఉత్తరప్రదేశ్ పోలీసులు వారి ఇళ్లలోనే నమాజ్ చేస్తున్న 12 మంది ముస్లింలను అరెస్టు చేశారు. వారిని ఏ కారణాలతో అరెస్టు చేశారు? వారు ఏ చట్టాన్ని ఉల్లంఘించారు? రాష్ట్రంలోని అన్ని నేరస్థులను తటస్థీకరించారా, UP పోలీసులు ఇప్పుడు తమ ఇళ్లలో ప్రార్థనలు చేస్తున్నందుకు సొంత పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు?” అంటూ చాలామంది ముస్లింలు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు తమ విశ్వాసాన్ని ఆచరిస్తున్నందుకు లక్ష్యంగా చేసుకుని హింసించబడుతున్నారనే వాదనను ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ఇస్లామో-వామపక్ష వాదులు పోస్ట్‌లతో నింపేస్తన్నారు.

అయితే ఇందులో నిజానిజాలేంటి? నిజంగానే ఇంట్లో నమాజ్ చేసినందుకు పోలీసులు ఆ ముస్లిం వ్యక్తులను అరెస్టు చేశారా కానే కాదు. అయితే, పై వాదనఅంతా ముస్లిం బాధితుల ప్లేబుక్‌లో ఒక భాగం, ఇక్కడ మతపరమైన ఆధిపత్యాన్ని చెప్తూ, సానుభూతిపొందేలా చేయడం అనేది ఇస్లామిక్ కార్యకలాపాలలో ఒక భాగం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు, ఇంట్లో నమాజ్ చేసినందుకుగానూ బరేలీ పోలీసులు 12 మంది ముస్లింలను అరెస్టు చేయలేదు, సోషల్ మీడియాలో ఇళ్లు అని చెప్పుకున్నట్లు అది ఒకరికి చెందిన ఇల్లు కాదు, పరిపాలనా అనుమతి లేకుండా ఖాళీగా ఉన్న ప్రైవేట్ ఇంట్లో నమాజ్ చేసినందుకు మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. తాము 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, ముగ్గురు అక్కడి నుండి పారిపోయారని, పరారీలో ఉన్న వ్యక్తులను కనుగొనడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

నిందితులైన ముస్లిం పురుషులను అదుపులోకి తీసుకోవడం ముందు జాగ్రత్త చర్య అని ఎస్పీ (సౌత్) అన్షిక వర్మ తెలిపారు. మొహమ్మద్‌గంజ్ గ్రామంలోని ఖాళీ ఇంటిని ముస్లిం వ్యక్తులు అనేక వారాలుగా మదర్సాగా ఉపయోగిస్తున్నారని స్థానికుల నుండి పోలీసులకు సమాచారం అందిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిపాలన అనుమతి లేకుండా ఆ ఇంట్లో సామూహిక నమాజ్ క్రమం తప్పకుండా జరుగుతుందని స్థానిక గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

“అనుమతి లేకుండా ఏదైనా కొత్త మతపరమైన కార్యకలాపాలు లేదా సమావేశాలు నిర్వహించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అలాంటి కార్యకలాపాలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటాము” అని పోలీసు అధికారి తెలిపారు.

“ఒక ఇంటిని తాత్కాలిక మసీదు మరియు మదర్సాగా మార్చారని మాకు సమాచారం అందింది. ఇది చట్టవిరుద్ధం. సరైన అనుమతి లేకుండా ఇలాంటి కార్యకలాపాలను పునరావృతం చేయవద్దని పాల్గొన్న వారికి చెప్పబడింది” అని ఎస్పీ వర్మ మీడియాకి తెలిపారు .

అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ ఇంట్లో నమాజ్ నిర్వహించిన ముస్లింను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఇస్లాంవాదులు, వారి ఉదారవాదలు నమాజ్ చేసినందుకు వారిని ‘అరెస్టు’ చేశారని కథనం ప్రచారం చేశారు.

కాబట్టి అక్కడ అసలేం జరిగిందంటే, ముస్లిం వ్యక్తులు ఖాళీగా ఉన్న ఇంట్లో నమాజ్ చేస్తూ, పరిపాలనా అనుమతి లేకుండా దానిని మసీదుగా , మదర్సాగా ఉపయోగిస్తున్నారని ఆరోపనలు ఉండడం వల్ల పోలీసులు అరెస్టు చేశారు. అంతే తప్ప వారి స్వంత ఇళ్లలో నమాజ్ చేసినందుకు వారిని అరెస్టు చేశారనే వాదన నిజం కాదు. కాగా అదుపులోకి తీసుకున్న వారందరినీ ప్రశ్నించి విడుదల చేశారు .భవిష్యత్తులో వారి చర్యలను పునరావృతం చేయవద్దని వారికి హెచ్చరికలు జారీ చేశారు.