
నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ సాహిత్య పరిషత్, స్థానిక శ్రీ రామకృష్ణా డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సమావేశంలో విభాగ్ సంఘ్ చాలక్ శ్రీ నీలకంఠేశ్వరయ్య తో పాటు, అతిథులు యోగాకాన్సస్ నెస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ గుమ్మడి దామోదర్ కుమార్ రెడ్డి, శ్రీ రామకృష్ణా విద్యాసంస్థల అధినేత శ్రీ గడ్డం రామకృష్ణారెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్ ప్రముఖ్ డాక్టర్ కాదర్ బాద్ ఉదయ్ శంకర్, నగర సంఘ్ చాలక్ శ్రీ మహేశ్వర రెడ్డి వేదికను పంచుకున్నారు. సదరు సమావేశంలో జ్యేష్ట స్వయం సేవకులు, సాహితీ వేత్తలు, నగర్ ప్రముఖులు, పరివార క్షేత్రాల ప్రముఖులు పాల్గొన్నారు.
అతిథులు పూజ అనంతరం “డాక్టర్ మోహన్ భాగవత్ తో ముఖాముఖి @సంఘ శతాబ్ది”,” 100 సం!!సంఘ యాత్ర, నూతన దిగంతాలు” పుస్తకాలను ఆవిష్కరించారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ, సంఘ్ పట్ల సమాజంలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే ఈ పుస్తకాలు అని తెలిపారు. ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక, ఆర్థిక పరిష్థితుల దృష్ట్యా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దృక్పథాన్ని, నేడు అనేక మాధ్యమాల్లో సంఘ్ పట్ల సమాచార మాధ్యమాల్లో వెల్లు వెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్ప గలిగే స్థాయిలో ప్రతి స్వయం సేవక్ ఉండాలని. భారతమాత పునర్వైభవానికి అతి చేరువలో ఉన్న ప్రస్తుత సమయంలో సంఘ్ లక్ష్యాన్ని, ఆలోచనను ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి ఇంటికి, ప్రతి భారతీయుడికి చేరువ చేయాల్సిన బాధ్యత మనందరిది అని తెలియ జేశారు. సంఘ్ సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలియ జేశారు.
సదరు కార్యక్రమాన్ని జిల్లా ప్రచార ప్రముఖ్ శ్రీ రవికుమార్, నగర్ ప్రచార ప్రముఖ్ శ్రీ చింతల పల్లి వాసు ప్రచార విభాగ సభ్యులు నిర్వహించారు.





