
కేరళలోని కన్నూర్ ప్రాంతంలో కన్నడిపరంబ ముత్తప్పన్ ఆలయంలో ఆరెస్సెస్ పాటను ప్రదర్శించగా… కమ్యూనిస్టు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిపై పెద్ద వివాదం రేగింది. జాతీయవాదులు, బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ బాధ్యులు ఓ సంగీత ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో గాయకులు ‘‘పరమ పవిత్ర మథమీ మన్నిల్ భారతాంబయే’’ అన్న మలయాళ దేశభక్తి పాటను పాడుతున్నారు. అయితే ఈ పాటను సంఘ్ కార్యక్రమాలలో తరుచుగా పాడుతుంటారు.
అయితే వామపక్ష అనుబంధ సంఘమైన DYFI కార్యకర్తలు ఈ సమయంలో గొడవకు దిగారు. ఈ పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ ఉత్సవాలను రాజకీయం చేస్తున్నారని, ఆరెస్సెస్ ఎజెండాలో భాగంగానే ఇదంతా జరిగిందని అర్థం పర్థం లేని విమర్శలకు దిగారు. ఆలయ కార్యక్రమంలో ఆరెస్సెస్ పాటలను ప్రదర్శించడానికి ఉత్సవ కమిటీ అనుమతించిందని, దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
మతతత్వ శక్తులు తమ భావజాలాన్ని రుద్దడానికి చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలను చేస్తొందని, దీనిని ప్రజలందరూ గుర్తించాలని, దీనిపై నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించింది.
ఇక… ప్రదర్శనకు అడ్డుపడటంపై DYFI నాయకులపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. హిందువులకు వ్యతిరేకంగా వామపక్ష సంఘం చేస్తోందని, ఇదేమీ అనుకోని ఘటన కాదని, హిందువుల విశ్వాసంపై కమ్యూనిస్టులు దాడి చేశారని బీజేపీ మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే చేశారని ఆరోపించింది.
ఆలయ ఉత్సవాలు, సాంస్కృతిక స్థలాలు అనేవి అత్యంత పవిత్రమైనవని, కమ్యూనిస్టులు రాజకీయాలకు వేదికలు చేయవద్దని బీజేపీ మండిపడింది. హిందూ ధర్మంపై కమ్యూనిస్టులకు పాతుకుపోయిన అసహనాన్ని మరోసారి బయటపెట్టినట్టు అయ్యిందన్నారు .





