News

ఏకాత్మ మావనవతా వాదం ఒక ఇజం కాదు ఒక నిజం : ముదిగొండ శివప్రసాద్

339views

విజయవాడలో నిర్వహించిన “60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్‌ పునఃస్మరణ” సదస్సు కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బిజెపి జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, పార్టీ సీనియర్‌ నేత రామ్‌ మాధవ్, చరిత్రకారుడు ముదిగొండ శివప్రసాద్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ ప్రసంగిస్తూ, ఈ రోజు ఈ సభలో పాల్గొడానికి నాకు వ్యక్తిగతంగా ఒకటి రెండు అర్హతలున్నాయి. అందుకే హైదరాబాదు నుంచి వచ్చాయి. వయోభారం సహకరించకున్నా దీన్ దయాళ్‌జీకి వినమ్ర నమస్సులు సమర్పించుకునేందుకు వచ్చాను. మొదటి అర్హత ఏంటంటే హైదరాబాదు సమీపంలోని ఘట్‌కేసర్‌లోని గురుకులానికి వచ్చిన దీన్‌దయాళ్ జీ ఇంగ్లీషులో ఏకాత్మమానవతా వాదం బేసిక్స్ చెబుతున్నపుడు ఆయన పాదాల వద్ద కూర్చుని నోట్స్‌రాసుకుని తెలుగులో అందరికీ వినిపించాను. ఇది నా మొదటి అర్హత. రెండోది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు నన్ను ఏబీవీపీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ కారణంచేత ఇక్కడ జనసంఘ్ మహాసభలకు కార్యకర్తగా వచ్చా. 60 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు నేను మరచిపోలేదు. ఏకాత్మ మానవతా వాదం గురించి రెండు మాటలు చెబుతా. దీన్ దయాళ్ గుంటూరుకు వచ్చినపుడు ఆయన హైమవతమ్మ వారి ఇంట్లో దిగారు. భోజనం కోసం పిలుపుకు వెళ్తే ఆయన చిరిగిపోయిన తన పంచను తానే సూదితో కట్టుకున్నారు. ఆమె కళ్లనీళ్లు పెట్టుకుని దీన్ దయాళ్‌జీకి కొత్త వస్త్రాలను తెప్పించారు. కొత్త వస్త్రాలను ధరింపచేసి భోజనం పెట్టారు. వారి మాట కాదనలేక భోజనం చేసి తర్వాత దానిని తీసేసి పాత వస్త్రాలు ధరించి కొత్త వస్త్రాలు బ్రాడీపేటలోని పేదలకు ఇచ్చేశారు. ఆయన చేసిన పనికి యజ్ఞనారాయణగారు ప్రశ్నిస్తే దీన్‌దయాళ్ తనకు కనీసం పాతదైనా ఉంది ఆ పేదవాడికి అదికూడా లేదని చెప్పారు. అలాంటి గొప్పవ్యక్తి దీన్ దయాళ్‌జీ. ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మావనవతా వాదం ఒక ఇజం కాదు ఒక నిజం. కాపిటలిజం, కమ్యూనిజంకు ప్రత్యామ్నాయంగా అందరికీ వాటికి మిన్నగా ఏకాత్మమాదనం ఆయన ప్రవచించారు. మన ప్రాణానికి దీన్ దయాళ్ విరాట్ అనే పేరు పెట్టారు. విశ్వచైతన్య ప్రాణశక్తిగా పేర్కొన్నారు. “పండిత దీనదయాళు పాడెను మానవగీతం సురగంగా జలపాతం నరజాతికి ఏకాత్మక నమస్కారం” అంటూ ఆయన ముగించారు.