
విజయవాడలో నిర్వహించిన “60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ” సదస్సు కార్యక్రమంలో రక్షణ రంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారుడు సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతీయ ఏకాత్మతా మానవదర్శనం ప్రవచించిన తర్వాత దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఈ మార్పుల కారణంగా వికసిత్ భారత్ లక్ష్యం వైపు మనం పరుగులు పెడతామన్నారు. 1750 వ దశకంలో 24 శాతం వృద్దిరేటు ఉన్న భారత్ స్వాతంత్య్రం వచ్చేనాటికి దిగజారిపోయిందన్నారు. దేశంలో ఏ వస్తువు లేని దుస్తితికి చేరుకున్నామన్నారు. డిఆర్‌డిఓ ప్రారంభించిన సందర్భంలో రక్షణ రంగంలోని పరికరాలను పరీక్షించడం వరకే పరిమితమయ్యామని, అయితే 2014 తర్వాత భారత్ ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా దేశంలో పలురకాల మార్పులు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల క్షిపణులు యుద్ద ట్యాంకులు తయారుచేస్తున్నామన్నారు. ఆయుధాలు దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమáతి చేసే పరిస్థితికి చేరామన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా సాంకేతిక అభివృద్ధి సాధించామన్నారు. ప్రైవేట్ సంస్థలు కలసి పనిచేస్తామని ముందుకు వస్తున్నాయన్నారు. రక్షణరంగంలో వస్తున్న మార్పులను ప్రపంచ దేశాలు సైతం మనల్ని పరిశీలిస్తున్నాయన్నారు. శాటిలైట్‌లతో క్షిపణి స్ధాయికి మనం చేరుకున్నామన్నారు. ఈ విషయం చూసి ప్రపంచం అబ్బురపోయిందన్నారు. ఈ రంగంలో మనదేశం నాలుగోస్ధానంలో ఉందన్నారు.బ్రహ్మోస్ క్షిపణిని ఆపరేషన్ సిందూర్‌లో వాడామన్నారు. స్వదేశీ గన్‌లు తయారుచేస్తున్నామన్నారు. ఈ రంగంలో దేశంలో 20 వేల పరిశ్రమలు వచ్చాయన్నారు. 30 శాతం నుంచి 60 శాతానికి పరిశ్రమల సంఖ్య పెరిగిదన్నారు. యువతలో మార్పు వచ్చిందని, గతంలో ఐఐటీ చదివిన విద్యార్థులు 75 శాతం విదేశలకు వెళ్తే నేడు 75 శాతం ఐఐటీ విద్యార్థులు దేశంలోనే ఉంటున్నారన్నారు. 400 విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. ఆకాష్ క్షిపణికి సంబంధించి తయారీలో విడిభాగాలు 87 శాతం చిన్న సంస్థలకు ఇవ్వడం జరిగిందన్నారు. 4.3 కోట్ల విద్యార్తులు ఉన్నత చదువులు చదువుతున్నారన్నారని చెప్పారు.



