News

వికసిత భారత్ లక్ష్యానికి దీన్ దయాళ్ జీ సిద్దాంతం : రామ్ మాధవ్

304views

విజయవాడలో 1965లో జరిగిన జనసంఘ్‌ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా ఈరోజు (23-01-26), రేపు( 24 -01-26) ఏకాత్మ మానవ దర్శన్‌ జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో .రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారణి రామ్ మాధవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచానికి నూతన దిశను భారత్ ఇవ్వబోతోంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఒక సంక్షోభం నడుస్తోంది. ప్రస్తుత విషయాలు ప్రస్తావించారు. సిద్దాంత రహిత పార్టీల వల్ల ప్రమాదం ఉంది. వికసిత భారత్ లక్ష్యానికి దీన్ దయాళ్ జీ సిద్దాంతం అందించారు. భారత దేశం ఒక ప్రాచీన దేశం. ఇరుగుపొరుగు దేశాలతో కలసి మెలసి ఉండాలన్న దీన్ దయాళ్ జీ చైనా తో ఎలా ఉండాలి అనే విషయం చెప్పారు. చైనా తో మనం రక్షణ రంగంలో ధీటుగా ఉండాలి. ఆనాడే దీన్ దయాళ్ ఉపాధ్యాయ విదేశీ విధానం పై వివరించారని పేర్కొన్నారు