
249views
కడుపు నిండా హిందుత్వంపై విషం.. బయటికి మాత్రం లౌకికవాదం అని చెబుతున్నారు. పోనీ లౌకికవాదంలో హిందుత్వం లేదా? అంటే అబ్బే.. అదేం కాదు.. అందరూ సమానమే అంటూ సుద్దులు వల్లిస్తుంటారు. లౌకికవాదం లౌకికవాదం అంటూ హిందూ దేవాలయాలపై, శ్రద్ధా కేంద్రాలపై, పండగలపై, ధార్మిక కార్యక్రమాలపై కక్ష పెట్టుకొని, ఏదో రకంగా డీఎంకే ప్రభుత్వం ఇబ్బందులను సృష్టిస్తోంది.
మొన్నటికి మొన్న తిరుప్పరం కుండ్రం దీపం విషయంలో,అంతకు ముందు హిందూ దేవాయాల విషయంలో స్టాలిన్ విపరీతమైన కక్ష పెట్టుకుంది. తాజాగా… కేరళలో వేదికగా జరుగుతున్న ‘‘కేరళ కుంభమేళా’’ విషయంలోనూ స్టాలిన్ సర్కార్ లేనిపోని నిర్బంధాలను విధిస్తోంది. మహా కుంభమేళాకు సంబంధించిన ఆచారాలలో పాల్గొనడానికి త్రిమూర్తి కొండల నుండి కేరళకు వెళ్తున్న పవిత్ర మహామేరు రథయాత్రకు డిఎంకె ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించారు.
అంతేకాకుండా మహా మేరును రథం నుంచి వేరు చేయాలని, మహా మేరును విడిగా రవాణా చేసుకోవాలని ప్రభుత్వం కొత్త షరతులు విధించింది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం గుండా వెళ్లడానికి వీలు లేదని చెప్పింది. తిరునవాయలో జరగనున్న మహా కుంభమేళా సన్నాహాల్లో భాగంగా ఈ రథయాత్రను ప్లాన్ చేశారు. నిర్వాహకుల ప్రకారం, ఈ ఊరేగింపు కేరళలోకి ప్రవేశించే ముందు తమిళనాడులోని తిరుప్పూర్, ఉడుమల్‌పేట్, పొల్లాచి, కోయంబత్తూర్ మరియు ఎట్టిమడై ప్రాంతాల గుండా వెళ్తుంది. నిజానికైతే ఈ మహా మేరు రథయాత్రను జునా అఖాడ నిర్వహిస్తోంది.
యాత్ర ప్రారంభోత్సవం మొదట ఉదయం 7.00 గంటలకు అమనలింగేశ్వర ఆలయంలో జరగాల్సి ఉండగా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు వేడుకను ఉదయం 9.00 గంటలకు వాయిదా వేశారు.
మొన్నటికి మొన్న తిరుపరంకుండ్రం వివాదం…
స్టాలిన్ సర్కార్ హిందువుల పండగ గానీ, కార్యక్రమాలు గానీ వచ్చే సరికి అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. సాక్షత్తూ తిరుప్పరంకుండ్రం విషయంలో హైకోర్టు ఆదేశాలిచ్చినా.. కార్తిక దీపం వెలిగించడానికి స్టాలిన్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. కానీ అదే సమయంలో ముస్లింలు నిర్వహించే చందన వేడుకలకు మాత్రం అనుమతిని ఇచ్చింది. హిందూ దేవాలయానికి చెందిన పవిత్ర స్థల వృక్షంపై ముస్లిం జెండాను ఎగురవేయడానికి అనుమతించింది. చివరికి కోర్టు ఆదేశాలతో దీనిని తొలగించారు. ముస్లింల కార్యక్రమానికి మాత్రం లౌకికవాదం అడ్డురాలేదు, ఒక్క హిందువుల కార్యక్రమం వచ్చేసరికి పూర్వ జన్మ వృత్తాంతం గుర్తొచ్చినట్లు ఠక్కుమని లౌకివాదం గుర్తొస్తుంది అక్కడి ప్రభుత్వానికి.
చివరికి కోర్టు ఆదేశాల తర్వాత ఆ జెండాను తొలగించారు.పైగా ముస్లిం కార్యక్రమాలు మత సామరస్య కార్యక్రమాలంటూ ప్రకటనలు. కానీ. కేవలం పది మంది హిందూ భక్తులు కొండపై వున్న కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నిస్తే మాత్రం స్టాలిన్ సర్కార్ అనుమతిని నిరాకరించింది.
సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని, హిందూ ధర్మం డెంగ్యూ, మలేరియాతో సమానమంటూ డిప్యూటీ సీఎం ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలుచేశారు. క్షేత్ర స్థాయిలో కూడా డీఎంకే హిందువులపై, ధర్మంపై ద్వేషాన్ని చూపుతోంది.





