News

పంజాబ్ లో దారుణం ఆరెస్సెస్ కార్యకర్తను కాల్చి చంపిన దుండగులు…

242views

పంజాబ్ లో దారుణం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త నవీన్ అరోరా (40) ని గుర్తు తెలియని వ్యక్తులు ఫిరోజ్ పూర్ లో కాల్చి చంపారు. తన దుకాణాన్ని మూసేసి, ఇంటికి తిరిగి వెళ్తుండగా… బుధ్వారావాలా మొహల్లా సమీపంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారని కూడా తెలిపారు.

“నవీన్ ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. మా బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది మరియు మేము సిసిటివి ఫుటేజ్‌ను స్కాన్ చేస్తున్నాము” అని ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పి భూపిందర్ సింగ్ సిద్దూ ప్రకటించారు.

“మేమందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. నవీన్ ప్రతిరోజూ బయటకు వెళ్లి తన పిల్లలతో గడపడానికి తిరిగి వస్తాడు. అతను వెళ్లిన ఐదు నిమిషాలకే, నా కొడుకును ఎవరో కాల్చి చంపారని మాకు సమాచారం అందించడానికి ఇద్దరు అబ్బాయిలు పరుగెత్తుకొచ్చారు” అని అతని తండ్రి బల్దేవ్ అరోరా వాపోయారు.

ఇక.. కాల్పులు జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు పారిపోయినట్లు సీసీ టీవీలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారిని గుర్తించడానికి పోలీసు బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని జిల్లా ఏఎస్పీ ప్రకటించారు.

నవీన్ అరోరా ఇంట్లో మూడు తరాలుగా సంఘ స్వయంసేవకత్వం కొనసాగుతూ వస్తోంది. నవీన్ తాత దీనానాథ్ ఫిరోజ్ పూర్ సంఘచాలక్ గా పనిచేశారు. ఆ తర్వాత నవీన్ తండ్రి కూడా స్వయంసేవక్. నవీన్ కూడా ఆరెస్సెస్ కార్యకర్తగా వున్నారు.