News

పుష్పగిరిలో 13వ శతాబ్దం శాసనాల గుర్తింపు

213views

వైఎస్సార్‌ కడప జిల్లాలోని పుష్పగిరి పరిధి శ్రీవైద్యనాథేశ్వరస్వామి ఆలయానికి పడమర దిశలో ఉన్న నాగేశ్వరస్వామి దేవాలయంలోని శాసనాలను చెన్నైకి చెందిన భారత పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం పరిశీలించారు. ఇటీవల చరిత్రకారుడు, రచయిత బొమ్మిశెట్టి రమేశ్‌ పరిశీలనలో ఇక్కడి నాగేశ్వరస్వామి ఆలయంతో పాటు శాసనాలు వెలుగులోకి వచ్చాయి. గర్భాలయంలో శివలింగానికి పాము చుట్టుకుని ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నైలోని పురావస్తు శాఖ కార్యాలయానికి చెందిన సిబ్బంది వీరమణికందన్, మణికంఠన్, కార్తవరాయన్‌లు గర్భాలయంతో పాటు పరిసరాల్లోని ఉన్న 20 శిలాశాసనాలను పరిశీలించారు. ఆయా శాసనాలు 13వ శతాబ్దానికి చెందినవిగా వారు నిర్ధారించారు.