News

రాంచీ దసరా వేడుకల్లో ముస్లింల సేవ

234views

ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరాబాదీ మైదానంలో దసరా సందర్భంగా జరిగే సంప్రదాయ రావణ దహన వేడుక మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం కోసం భారీస్థాయిలో రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి బొమ్మలను ముస్లిం కళాకారులు రూపొందిస్తుండటం విశేషం.

భారత్ లోని గంగా – జమున సంస్కృతికి ప్రతీకగా గత కొన్ని దశాబ్దాలుగా ముస్లిం కళాకారుల కుటుంబాలు ఈ బొమ్మలు తయారుచేస్తు న్నాయి. ప్రతి ఏటా తాము చేసే ఈ పనిని కేవలం జీవనోపాధిగా మాత్రమే కాకుండా, సుహృద్భావ సందేశం చాటే పవిత్ర కార్యంలా చూస్తామని వీరు చెబుతున్నారు. ఈ ఏడాది రావణుడి బొమ్మ 70 అడుగులు, మేఘనాథుడు 65, కుంభకర్ణుడి బొమ్మ 60 అడుగులు ఉండేలా సిద్ధం చేస్తున్నారు. దసరాను సామాజిక ఐక్యతా సందేశాన్ని చాటే వేడుకగా ఏటా తాము జరుపు కొంటామని నిర్వాహకులు తెలిపారు.