News

బంగ్లా సరిహద్దులో దుర్గ గుడి, బీఎస్ఎఫ్ భద్రతతో పూజలు

211views

భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దులో గల నూట యాభై ఏళ్లనాటి దుర్గమ్మ గుడిలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రొటోకాల్ మధ్య ఏటా 9 రోజులు శరన్నవరాత్రి పూజలు జరుగు తాయి. తమ నివాసాలకు దూరంగా.. సరిహద్దు కంచెను ఆనుకొని ఉన్న ఈ ఆలయంలో సమీప గ్రామస్థులు పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం హారతి, నిమజ్జనం.. ఇలా అన్ని ఆచారాలు సూర్యాస్తమయానికి ముందే పూర్తి చేయాలి. కుషియారా నది ఒడ్డున అస్సాంలోని మాణికప్పుర్ పట్టణ పరిధిలో ఈ గుడి ఉండేది. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ తో సరిహద్దు ప్రాంత పరిమితుల్లోకి వచ్చింది. దీంతో అప్పట్నుంచీ బీఎస్ఎఫ్ జవాన్లు ఈ గుడిని పర్యవేక్షిస్తున్నారు. ఆలయ సందర్శనకు సరిహద్దు ద్వారాల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. జవాన్లు నిర్ణీత సమయాల్లో మాత్రమే ఈ ద్వారాలను తెరుస్తారు.