News

రాయచోటిలో అహిల్య బాయి 300 వ జయంతి సభ

205views

మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సంఘసంస్కర్త అహిల్య బాయి హోల్కర్ అని కేంద్ర ప్రసార, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన అహిల్య బాయి హోల్కర్ 300 వ జయంతి సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ చిన్నతనం నుంచి శివ భక్తురాలు అయిన అహిల్య బాయి హోల్కర్ చేసిన పనులను స్ఫూర్తిగా తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. మహిళా సాధికారత కోసం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం, మరుగుదొడ్లు నిర్మించడం, డ్వాక్రా సంఘాలకు రుణాలు మంజూరు చేయడం ఇంటింటికి కులాయి కనెక్షన్ ఇవ్వడం లాంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. అహిల్య బాయి లాంటి ధీరవనితలకు ఎందరికో చరిత్రలో సరైన గుర్తింపు దక్కలేదన్నారు. అలాంటి వారి గురించి రేపటి తరానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో అహిల్య బాయి హోల్కర్ జయంతిని జరుపుకుంటున్నామని కేంద్రమంత్రి మురుగన్ తెలిపారు.