
307views
ఉత్తర్ ప్రదేశ్ లోని వివాదాస్పద సంభల్ జామా మసీదు లోపల నిర్మాణం ఎనామిల్ పూతతో బాగానే ఉందని, సున్నం వేయ నక్కర్లేదని భారత పురావస్తు సర్వే విభాగం (ఏఎస్ఐ) అలహా బాద్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. రంజాన్ కు ముందు మసీదుకు సున్నం వేయాలని పిటిషన్ వేసిన మసీదు కమిటీ.. ఈ నివేదికపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఏఎస్ఐ తప్పుడు నివేదిక ఇచ్చిందని తెలిపింది. సున్నం వేయాల్సిందేనని వాదించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే మంగళవారం లోపు సమర్పించాలని మసీదు కమిటీకి కోర్టు సూచించింది. సంభల్ జామా మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ఏఎస్ఐని ఆదేశించింది. సున్నం వేయడంపై మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.




