News

పాకిస్థాన్ మదరసాలో ఆత్మాహుతి దాడి

328views

పాకిస్థాన్ లోని దారుల్ ఉలూమ్ హక్కానియా మదరసాలో శుక్రవారం పవిత్ర ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో మదరసా ముఖ్య మతగురువుతోపాటు ప్రార్థనల్లో పాల్గొంటున్న మరో ఆరుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. వాయవ్య పాకిస్థాన్ లో కల్లోలానికి నెలవైన ఖైబర్ పభుంఖ్వా రాష్ట్రంలో ఈ దాడి జరి గిందని పోలీసులు తెలిపారు. దాడిలో మృతి చెందిన ముఖ్య గురువు హమీదుల్ హక్ హక్కాని జమియాత్ ఉలెమా ఇస్లాం (జేయూఐ) చీలిక వర్గానికి నాయ కత్వం వహించేవారు. ఆత్మాహుతి దాడి సంభవించిన మదరసా హనఫీ దేవబందీ శాఖకు చెందిన ఇస్లామిక్ విద్యాలయం. ఇక్కడ తర్ఫీదు పొందిన అనేకులు తద నంతరం తాలిబాన్ నేతలయ్యారు. ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యులెవరన్నది తెలియరాలేదు,