News

కుంభమేళా ప్రాంతంలో 15 రోజుల శుభ్రత కార్యక్రమం

273views

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ మహాకుంభమేళా ముగిసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో 15 రోజుల పాటు ప్రత్యేక శుభ్రత కార్య క్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మేళా జరిగిన ప్రాంతాన్నంతా శుభ్రపరచాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పరిశుభ్రత కార్యక్రమానికి ప్రత్యేక అధికారి ఆకాంక్ష రాణా నేతృత్వం వహించనున్నారు.’స్వచ్ఛత మిత్రలు’, ‘గంగా సేవా దూతలు’ ఈ పారిశుద్ధ్య క్రతువులో భాగస్వాములవుతున్నారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వారంతా 15 రోజుల పాటు సంగంమం ఘాట్లు, మేళా ప్రాంతానికి దారితీసే రహదారులు, అక్కడి శాశ్వత, తాత్కాలిక మౌలిక సదుపాయాలను పరి శుభ్రం చేస్తారని వివరించింది.