
రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని దుర్వినియోగ పరచడం, వదంతులను వ్యాప్తిచేయడం తగదని రాజకీయ నేతలను సాధువులు, సంతులు హెచ్చరించారు. మహాకుంభ్ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. జనవరి 29 నాటి దుర్ఘటన తర్వాత మహాకుంభమేళాపై విమర్శలు కురిపిస్తుండటాన్ని వారు ఖండించారు. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి..‘‘మీరు సనాతన ధర్మాన్ని ఎన్నడూ నుసరించలేదు..గౌరవించలేదు..దీన్నుంచి ప్రయోజనం పొందాలని ప్రయత్నించొద్దు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని అనుసరించే వారి పట్ల మీరు అనుసరించిన వైఖరి మాకు తెలుసు’’ అని శ్రీపాంచ్ నిర్వాణీ అనీ అఖాడాకు చెందిన మహంత్ సంతోష్ దాస్ సత్తువ బాబా మహారాజ్ సూచించారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.




