News

నాగ ప్రతిమల ధ్వంసం

382views

మాఘమాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజించుకునే నాగ ప్రతిమలను ఓ దుండగుడు ధ్వంసం చేశాడు.శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం మల్లయ్యగారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు అర్ధరాత్రి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడని అధికారులు తెలిపారు. గ్రామ కూడలిలో ఉన్న నాగులకట్టపై భక్తులు పూజించుకుంటున్న నాగ ప్రతిమలను ముక్కముక్కలుగా ధ్వంసం చేశాడు. ఆ సమయంలో శబ్దాలకు చుట్టుపక్కల వారు నిద్రలేచి దారుణాన్ని పసిగట్టి శ్రీనివాసులను బంధించి కదిరి రూరల్‌ పోలీసులకు అప్పగించారు.అతని పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.