
317views
జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీగిరి శ్రీశైల క్షేత్రంలో నేడు ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 21 వరకు జరుగుతాయి. ప్రధానాలయంలోని శివాజీ గోపుర పునర్నిర్మాణం, ఉపాలయాల పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ, క్షేత్ర పరిధిలోని ఉపాలయాల్లో శివలింగం, నందీశ్వర ప్రతిష్ఠ సందర్భంగా మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మహాకుంభాభిషేకం సందర్భంగా ఫిబ్రవరి 21న శాంతి హోమం, పౌష్టిక హోమం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 8.45 గంటల నుంచి ఆలయాలలో యంత్ర ప్రతిష్ఠ, శివలింగ నందీశ్వర ప్రతిష్ఠ, శివాజీ గోపురానికి సువర్ణ కలశ ప్రతిష్ఠ జరుగుతుంది.





