News

సుభాష్ చంద్రబోసే జాతిపిత : తమిళనాడు గవర్నర్‌

373views

భారతదేశానికి స్వాతంత్య్రం గాంధీజీ ఉద్యమం వల్ల రాలేదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ పోరాటం కారణంగానే స్వాతంత్య్రాన్ని సముపార్జించుకున్నామని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అన్నారు. స్థానిక అడయార్‌లోని అన్నా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకల సభలో ఆయన చాన్సలర్‌ హోదాలో ప్రసంగిస్తూ… ‘నేతాజీ ఇండియన్‌ నేషనల్‌ ఫోర్స్‌’ పేరుతో సైనికదళం తెల్లదొరలకు సింహస్వప్నంగా ఉండేదని, సుభాష్ చంద్రబోసే మన జాతిపిత అని పేర్కొన్నారు. ఆంగ్లేయులు జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమం వల్ల భారతదేశాన్ని విడిచివెళ్లలేదని బ్రిటన్‌ ప్రధాని అట్లీ గతంలో పేర్కొన్నారని గవర్నర్‌ రవి గుర్తు చేశారు.