News

నంద్యాలలో కరసేవకులకు, వారి వారసులకు ఘన సన్మానం

297views

నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండల కేంద్రంలోని అల్వాల సత్రంలో పరిసర నాలుగు మండలాలోని అయోధ్య కరసేవకులకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది.

స్వర్గస్తులైన కరసేవకుల స్థానంలో వారి వారసులను సన్మానించారు.ఈ సందర్బంగా కరసేవకులు వారి అనుభవాలను ఉద్వేగం భరితంగా వివరించారు. వారి త్యాగం వృధా కాలేదని, వారు ఎంతో ఆశగా ఎదురు చూసిన అయోధ్య మందిర నిర్మాణ కల సాకారమైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

అలాగే నాలుగు మండలాల నుండి రామ భక్తులు పాల్గొని ప్రతి హిందూ ఇంటికి అయోధ్య నుండి వచ్చిన అక్షతలు, ఆహ్వానముల పంపిణి పూర్తి అయిన సందర్భంగా వారి వారి అనుభవాలు పంచుకున్నారు‌

22వ తేదీన ప్రతి గ్రామంలో దేవాలయం కేంద్రంగా టీవి లేదా స్క్రీన్ ఏర్పాటు చేసుకుని అయోధ్యలో జరిగే శ్రీ రామ జన్మభూమిలో జరిగే బాల రాముని ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూడాలని, తదనంతరం, హారతి, అక్షత ధారణ, అన్న ప్రసాద వితరణ కు ఏర్పాట్లు చేసుకోవాలని, సాయంత్రం ప్రతి ఇంటి వద్ద 5 రామ జ్యోతులు వెలిగించాలని, గ్రామస్తులందరూ ఆనందోత్సవాల మధ్యన గ్రామోత్సవం పండుగలా వేడుక జరుపుకోవాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు జిల్లా ప్రముఖ్ రాంప్రసాద్, బాలయ్య, కమ్మయ్య పిలుపునిచ్చారు.

తదనంతరం 500 సంవత్సరాల ఘట్టాలను వివరించే జాగృతి వారపత్రిక ప్రత్యేక సంచిక జగదానంద కారక పుస్తకమును కర సేవకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దల్ ఖండ ప్రముఖ్ నవీన్ , అశోక్, కళ్యాణ్ , పుల్లయ్య, సత్యనారాయణ రెడ్డి ,శ్రీధర్‌లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.