ArticlesNews

శ్రీరామ జన్మభూమి విముక్తి పోరాటంలో ప్రధాన వ్యక్తులు

443views

శ్రీ రామ జన్మభూమి విముక్తి కొరకు తమ సర్వస్వాన్ని అర్పించిన రామ భక్తులలో పూజనీయ సంత్ అభిరామ్ దాస్, కృష్ణ కరుణాకర్ నాయర్, పరమ పూజనీయ దేవరహ్ బాబా, మహంత్ రామచంద్ర దాస్ పరమహంస మరియు మహంత్ అవైధ్యనాథ్ జీ మహారాజ్ వంటి వారు ఎందరో ఉన్నారు. శ్రీ రామ జన్మభూమి విముక్తి పోరాటంలో ప్రధాన వ్యక్తుల గురించి ఈ కధనంలో తెలుసుకుందాం.

శ్రీరామ జన్మభూమి విముక్తి పోరాటంలో ప్రధాన వ్యక్తులు

పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ దేవరస్

పూజ్య బాలా సాహెబ్ దేవరస్ గారు 1973 నుండి 1994 వరకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తృతీయ సర్ సంఘ్ చాలక్‌గా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లేదా సంఘ్‌లోని స్వయం సేవకులు చురుకుగా శ్రీరామ జన్మభూమి విముక్తి పోరాటంలో పాల్గొనాలని మరియు సంఘ్ ఈ పోరాటంలో అంతిమం వరకు చురుకుగా ఉండాలనినిర్ణయం తీసుకుంది. స్వయంసేవకుల ద్వారా ప్రాంతీయ స్థాయిలో అనేక శాఖలు స్థాపించబడ్డాయి.స్వయంసేవకుల ద్వారా ప్రాంతీయ స్థాయిలో అనేక శాఖలు స్థాపించబడ్డాయి.

పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ గారు సీనియర్ ప్రచారకులను నియమించడం ద్వారా ఆ శాఖలకు అఖిల భారత రూపం ఇచ్చారు.ఆయన ప్రభావంతోనే శ్రీరామ మందిర ఉద్యమ సమయంలో హిందూ శక్తి యొక్క గొప్ప రూపం వెల్లడైంది.రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్,భజరంగ్ దళ్, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ వంటివి కీలక పాత్ర పోషించాయి.

శ్రీ అశోక్ సింఘాల్

శ్రీ రామ జన్మ భూమి ఉద్యమ స్థాపకులు మరియు హిందూ ఐక్యతకు గొప్ప వ్యూహకర్త.శ్రీ రామ జన్మభూమి ఉద్యమానికి సూత్రధారులు మరియు విముక్తి తర్వాత దేశంలోని అతిపెద్ద హిందూ సమాజ ఐక్యతకు వ్యూహకర్త.ఈయన 20 ఏళ్ల పాటు విశ్వ హిందూ పరిషత్ ముఖ్యులుగా ఉన్నారు.1942లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులు అయ్యారు.అయోధ్యలో తాళాలు తెరవడంతో పాటు వివాదాస్పద కట్టడం కూల్చివేత వరకు ఈ ఉద్యమంలో కీలక వ్యక్తి ఆయనే. అశోక్‌గారే 1989లో శ్రీ రామ మందిర శంకుస్థాపనకు కామేశ్వర్ చౌపాల్ పేరును ఎంపిక చేశారు. ఆ తర్వాతనే రామ మందిరం కోసం కామేశ్వర చౌపాల్ మొట్టమొదటి ఇటుకను వేశారు.

ప్రొ. రాజేంద్ర సింగ్ (రజ్జు భయ్య)

ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్, రజ్జు భయ్య, పరమ పూజనీయ రజ్జు భయ్య రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నాల్గవ సర్ సంఘ్ చాలక్. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కొరకు రజ్జు భయ్య తన జీవితాంతం వరకు పోరాడారు.1983లో కాంగ్రెస్‌కు వెలుపల ఉన్న కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.1983లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరమ పూజనీయ రజ్జు భయ్య సమావేశం నిర్వహించారు.ఇందులో ఇందిరా గాంధీకి లేఖ రాయడం ద్వారా, హిందువుల ధార్మిక క్షేత్రాలు మధుర, కాశీ మరియు అయోధ్యల పున:స్థాపనకు పట్టుబట్టారు.

శ్రీ హెచ్.వి. శేషాద్రి

శ్రీ హెచ్.వి. శేషాద్రిగారు శ్రీ రామజన్మభూమి ఉద్యమంలో ముఖ్యులు. 1983లో శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు మొదటి ఏకాత్మ యాత్ర నిర్వహించినప్పుడు దానికి సంబంధించిన పూర్తి బాధ్యతను మానవీత శ్రీ శేషాద్రికి అప్పగించారు. 6 డిసెంబర్ 1992న మాననీయ శేషాద్రి ఇతర నాయకులతో కలిసి అయోధ్యలోనే ఉన్నారు. సంఘ్ తరపున మొదటి నుంచి శ్రీ రామ జన్మభూమి ఉద్యమ కార్యాచరణను మాననీయ శేషాద్రి గారే రూపొందించేవారు.ఈయన పలు భాషల్లో నిష్ణాతులు. కర సేవకులు వివాదాస్పద నిర్మాణంపైకి ఎక్కినప్పుడు పరిస్థితి అదుపు తప్పింది. మాననీయ శేషాద్రి గారు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, తెలుగు మరియు మలయాళీ భాషల్లో కరసేవకులను తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.మాననీయ శేషాద్రిగారు 1998లో శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని హిందూ పునరుజ్జీవ ఉద్యమంగా పేర్కొన్నారు.

శ్రీ మోరోపంత్ పింగళే

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మొదట సర్ సంఘ్ చాలక్ పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ చేతుల్లో రూపుదిద్దుకున్నారు. స్వయంసేవకులు మోరోపంత్ పింగళే గారు అయోధ్య పోరాటానికి రూపశిల్పులు. ఆయన అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని రాముడి శిలల ద్వారా ఇంటింటికి చేరవేశారు.పింగళేగారు ఒక రణ విధానం అన్నట్లు అయోధ్యలో ప్రతిపాదిత శ్రీ రామ మందిర నిర్మాణం కోసం 3 లక్షల ఇటుకలను భారతదేశంలోని ప్రతి గ్రామానికి పంపిణీ చేశారు. తర్వాత గ్రామం నుంచి తాలూకాలకు, తాలూకాల నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి
ఈ విధముగా ఈ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి.శిలా పూజన్,శిలన్యాస్,రామపాదుక, రామజ్యోతి యాత్రలు అన్ని పింగళే గారి మది నుంచి పుట్టినవే. మార్గదర్శకుడి పాత్రను పోషించడం కానీ ఘనతను తీసుకోకపోవడం, పథకాలను రచించడం కానీ అదృశ్య శక్తిగా ఉండడం మోరోపంత్ పింగళే గారి పని విధానము

శ్రీ విష్ణు హరి దాల్మియా

విష్ణు హరి దాల్మియా పారిశ్రామికవేత్తనే కాకుండా హిందుత్వ నాయకులు కూడా.ఆయన 1992 నుంచి 2005 వరకు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు. 1985లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినప్పుడు విష్ణు హరి దాల్మియా దానికి కోశాధికారిగా నియమితులయ్యారు. డిసెంబరు 6న వివాదాస్పద కట్టడం కూల్చివేత అనంతరం రెండు రోజుల తర్వాత అంటే 8 డిసెంబరున ఆయన్ను లాల్ కృష్ణ అద్వానీ, డాక్టర్ మురళీ మనోహర్ జోషి గారు, అశోక్ సింఘాల్‌తో పాటు అరెస్టు చేశారు.

శ్రీ రామ జన్మభూమి విముక్తి కోసం మరియు రామ కార్యం కోసం ఎవరైతే తమ శరీరం, మనస్సు మరియు సంపదలతో పాటు పూర్తి జీవితాన్ని అంకితం చేశారో..అటువంటి మహానుభావులందరికీ కోటి కోటి వందనాలు.