
223views
అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున ఈ నెల 22వ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ ఉత్తర్వులను బ్యాంకులకూ వర్తింపజేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకూ సెలవు వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఒడిశా రాష్ట్రాలు కూడా సెలవు ప్రకటించాయి.




