News

భారత్‌ ఆత్మనిర్భర్‌ తో చైనాకు చెక్, టపాసులపై నిషేధంతో లక్ష కోట్ల నష్టం

318views

బోర్డర్‌లో గిల్లి కజ్జాలకు దిగుతోన్న చైనాకు భారత్‌ షాక్‌ల మీద షాక్‌లనిస్తోంది. ఆత్మనిర్బర్‌ భారత్‌లో భాగంగా ఇప్పటికే చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

తాజాగా చైనాకు మరో బిగ్‌ షాక్‌ ఇస్తూ మేడిన్‌ చైనా టపాసులపై నిషేధం విధించింది.దీంతో చైనాకు 50వేల కోట్ల నష్టం వాటిల్లింది.

భారత్‌లో పండుగ సీజన్‌ వచ్చిందంటే చైనా కంపెనీలకు పండుగే పండుగ. ఇబ్బడిముబ్బడిగా బొమ్మలను భారత్‌ మార్కెట్‌లోకి డంప్‌చేసి బాగా సొమ్ముచేసుకునేవి చైనా కంపెనీలు.సరిహద్దు వివాదాల క్రమంలో ఆత్మనిర్బర్‌ అంటూ భారత్‌.. చైనాకు చెక్ పెడుతూ యాప్‌లపై నిషేధం విధించింది.

మేకిన్‌ ఇండియా విధానం స్వదేశి నినాదానికి మరింత ఊపునిచ్చింది. మేడిన్‌ చైనా వస్తువుల్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు హోరెత్తాయి. ఈ సెగ చైనా ఆర్ధిక వ్యవస్థకు పెద్ద నష్టాన్నే తెచ్చి పెట్టింది.

దీపావళి వస్తుందంటే చైనా కంపెనీలకు పండగే.. కాకర వత్తులు.. చిచ్చు బుడ్లు. రాకెట్లు, రంగు రంగుల మతాలబులతో ఇండియన్‌ మార్కెట్‌ను ఆక్రమించేవి చైనా బాణాసంచా కంపెనీలు. కానీ, ఇప్పుడు కథ మారింది. మేడిన్‌ ఇండియా స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది.

ఆత్మనిర్బర్‌ నినాదమే విధానంగా CAIT.. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ చైనా దిగుమతులపై నిషేదాన్ని ప్రకటించింది. దాంతో దేశీయ మతాబులకు మంచి రోజులు వచ్చాయి. గతేడాది దీపావళి బాణా సంచా విక్రయాల్లో చైనా ప్రొడక్ట్స్‌ తుస్సు తుస్సు మంటే.. మేడిన్‌ ఇండియా టపాసుల విక్రయాలు రాకెట్‌లా దూసుకెళ్లాయి. బాణాసంచా ఇండస్ట్రీ సహా కార్మికులకు ఆర్ధిక బలాన్నిచ్చాయి.

వినాయక చవతి, ధన్‌ తేరాజ్‌.. దసరా, ఇప్పుడు దీపావళి పండుగల్లో మేడిన్‌ ఇండియా బ్రాండ్‌ దూసుకెళ్తోంది. స్వదేశి ఉత్పత్తుల వినియోగం పెంచడానికి CAIT తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ ఏడాది ఇండియన్‌ మార్కెట్‌లో చైనా టపాసులకు చోటు లేదు

CAIT ఆత్మనిర్బర్‌ నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థకు పొగ పెట్టింది. మేడిన్‌ చైనా టపాసుల దిగుమతిపై బ్యాన్‌ విధించింది. దీంతో చైనాకు 50వేల కోట్ల నష్టం అనేది ప్రాథమిక అంచనా. టపాసులు సహా మిగతా వస్తువలను కలిపిచూస్తే చైనాకు ఎటూ లేదన్న లక్ష కోట్ల భారీ నష్టమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దీపావళికి నరకాసుర వధ.. కానీ, అంతకన్నా ముందే బాణాసంచా మార్కెట్‌లో చైనాసుర వధ జరిగిందన్న మాట.