
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలియజేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ముందు ఈరోజు ఉదయం పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్ లెట్స్ ను టిటిడి ఛైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నవంబరు 9వ తేదీన లక్షకుంకుమార్చన, అంకురార్పణ, నవంబరు 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని… నవంబరు 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమీతీర్థం నిర్వహిస్తామని.. నవంబరు 19న పుష్పయాగం నిర్వహిస్తామన్నారు.





