News

షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

259views

జమ్ముకశ్మీరులోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున షోపియాన్‌లోని అల్షిపొరా ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. మృతులను మోరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూఖ్ అలియాస్ అబ్రార్‌గా గుర్తించామన్నారు. ఇరువురు లష్కరే తొయీబా ఉగ్ర సంస్థకు చెందినవారని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా వెల్లడించారు.