News

వైభవంగా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి తెప్పోత్సవం

344views

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేక వార్షిక ఉత్సవాల్లో చివరిరోజు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ లు, అర్చన పూజలు జరిగాయి. ఆదివారం సె లవురోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు చేసి విశేషాలంకరణ చేశారు. అ నంతరం మేళ తాళాలతో ఊరేగింపుగా పుష్కరణి వద్దకు వేంచేపు చేసి తెప్పపై కొలువుదీర్చారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యా లు, మేళతాళాల నడుమ స్వామివారు మూడు ప్రదక్షిణలు జలవిహారం చేశారు. తెప్పోత్స వాన్ని తిలకించేందుకు భక్తులు సాయంత్రం నుంచి పుష్కరిణి చుట్టూ కూర్చున్నారు. స్వామివారు జలవిహారం చేస్తుంటే భక్తుల జై గణేష..జైజై గణేష నామస్మరణలు మార్మోగాయి.