
316views
అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అమృత్‌సర్‌లోని ఒక గ్రామం శివార్లలో రెండు హెరాయిన్ మరియు నల్లమందు ప్యాకెట్లతో పాటు డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది.
పక్కా సమాచారం మేరకు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమృత్‌సర్‌లోని హర్డో రాత్తాన్ గ్రామంలో తనికీలు నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో హెక్సా కాప్టర్ డ్రోన్ తో పాటు 6.3 కేజీల హెరాయిన్ ప్యాకెట్, 60 గ్రాముల ఓపియం
ప్యాకెట్ ను హర్డో రాత్తాన్ గ్రామ శివారుల్లో కనుగొన్నారు. ఈ డ్రోన్ పాకిస్తాన్ నుంచి భారత్ భూభాగంలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గత కొంత కాలంగా నిషిద్ధ వస్తువులతో కూడిన డ్రోనులు తరచుగా అమృత్సర్ గ్రామాల్లో పట్టుబడుతున్నాయి.




