
315views
ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి శత పతకాలు సాధించింది. ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్‌లో చైనీస్ జట్టును చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసింది. అలాగే ఆర్చరీ ఈవెంట్‌లో మొత్తం నాలుగు పతకాలను భారత్ కైవసం చేసుకుంది. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది. ఇదే అర్చరీ విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణం గెలుచుకోగా.. అభిషేక్ రజతం సాధించాడు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కి చేరింది. ఇందులో స్వర్ణం- 25 రజతం- 35 కాంస్యం- 40 పతకాలు ఉన్నాయి. దీంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 4 స్థానంలో కొనసాగుతోంది.




