
256views
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం కీలక ఘట్టమైన అమ్మవారి విగ్రహం తయారీ, ఊరేగింపు వైభవంగా చేపట్టారు. సాయంత్రానికి అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరి వీధిలోని కుమ్మరింట పోలేరమ్మ ప్రతిమను సిద్ధం చేసి సంప్రదాయబద్ధంగా సాంగ్యం సమర్పించారు. వేలాదిమంది భక్తులు పోలేరమ్మను దర్శించుకు న్నారు. అర్ధరాత్రి తరువాత మెట్టినింటికి తీసుకొచ్చి అక్కడ కనుగుడ్లు, దిష్టిచుక్క ఏర్పాటుచేసి కిలారింపులు, దివిటీ వెలుగులు, యువకుల చిందుల మధ్య పోలేరమ్మ తల్లిని చప్పరంపై ఊరేగింపుగా ఆలయం వద్దకు తెచ్చారు. ఇక్కడ గురువారం సాయంత్రం వరకు పోలేరమ్మను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వహించే విరూపోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.




