
226views
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వి.వి.పురంలోని కన్నికాపరమేశ్వరి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాన్ని దేవదాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు, కాణిపాక వరసిద్ధుడి ఆలయం వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యుడు సోమశేఖర్ గురుక్కుళ్, అర్చక, పండితులు పాల్గొన్నారు.





