News

విరిగిన త్రిపురాంతకం ఆలయ ధ్వజస్తంభం

305views

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో శుక్రవారం పెనుగాలుతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభం విరిగిపడిపోయింది. అప్పటికే ఆలయం మూసివేసి ఉండటం, భక్తులెవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం విరిగిన ధ్వజస్తంభాన్ని 2004లో పునఃప్రతిష్ఠించారు. కాగా పలు గ్రామాలలో రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.