
కడప జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభ వంగా నిర్వహిం చారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తిరుణాల శుక్రవారం సాయంత్రం ముగిసింది. రథోత్సవ వేడుకల సందర్భంగా రథంలో వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాలను శుభము హుర్తాన వేద పండితులు అధిరోహింపజేయగా భక్తు లు గోవింద నామ స్మరణలతో మార్మోగుతూ రథాన్ని ముందుకు కదిలించారు. మధ్యాహ్నం కొంత దూరం వరకు లాగి నిలిపి సాయంత్రం మళ్లీ రఽథాన్ని లాగి యఽథాస్థానానికి లాగారు. ఈ తిరుణాలకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటుగా కర్ణాటకకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివ చ్చారు. కాగా గురువారం రాత్రి గరుడోత్సవ వేడుక లను నిర్వహిం చారు. అలాగే సంతాన వేణుగోపాల స్వామి సతీసమేత దంపతులకు ఆలయ పండితులు ప్రత్యేకంగా అలంకరించి సాంప్రదాయబద్ధంగా ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుణాలకు వచ్చే భక్త్తులకు ఎటువంటి అసౌకర్యం కలు గకుండా ఆలయ కమిటీ సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేశా రు. విద్యుత దీపాలతో అలంకరించిన చాందినీ బండ్లను ఊరేగించారు. అలాగే పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తలనీలాలను సమర్పించా రు. అలాగే మండలంలోని అంగళ్ళు సమీపం లోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల యాజమా న్యం, తెట్టు మాజీ సర్పంచ కామకోటి ప్రసాదరావులు వేర్వేరుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ నులక మనోహర్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ బీసీసెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్, రుద్ర బాలకృష్ణ, రాజారెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, మోహనరెడ్డి, బొగ్గు భాస్కర్, ఆలం, సదాశివ, సూరి, చంద్ర, వెంకటర మణారెడ్డి, సదాశివ, శ్రీనివాసులు, ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





