
ఏపీలోని అనకాపల్లి వద్ద ఉన్న రాంబిల్లి పోర్టు ప్రాంతాన్ని నేవీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విశాఖపట్నంతోపాటు.. రాంబిల్లిని నుంచి నేవీ కార్యకలాపాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ఇప్పటికే నేవీ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉత్తరం, దక్షిణం వైపు సుమారు మూడ నాటికల్ మైళ్లు.. సముద్రం వైపునకు 12 మైళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని నేవీ బృందం సూచించింది.
నేవీ కార్యకలాపాలకు ప్రత్యామ్నాయంగా.. రాంబిల్లి ప్రాంతం బాగుంటుందని భావించిన ఈస్టర్న్ నేవీ అధికారులు.. దానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని కేంద్ర డిఫెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో నేవీకి ప్రత్యామ్నాయ ప్రాంతంగా రాంబిల్లి పోర్టు ప్రాంతాన్ని నేవీ కార్యకలాపాలకు కేటాయించారు. నేవీ అధికారులకు కేటాంయించిన ప్రాంతంలో పోర్టు పనులు కానీ.. పోర్టుకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టవద్దని అధికారులు కోరారు.
ఇప్పటికే విశాఖ నుంచి ఈస్టర్న్ నేవీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈక్రమంలో మరింత బందోబస్తు.. గస్తీ పెంచేందుకు రాంబిల్లి పోర్టును అధికారులు ఎంచుకున్నారు. ఏపీలోని అనేక తీవప్రాంతాలను నేవీ అధికారులు పరిశీలించారు. అయితే.. అన్నిటికంటే.. రాంబిల్లి పోర్టు నేవీ కార్యకలాపాలు.. అనుకూలంగా ఉంటుందని నేవీ బృందం భావించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు చర్చలు జరిగి ఒప్పించారు. ఇక పోర్టును నేవీ ఆధీనంలో ఉండటం వల్ల భద్రతా చర్యల రీత్యా మూడు నాటికల్ మైళ్లు.. ఉత్తరం దక్షిణం దిశగా.. అదేవిధంగా సముద్రం లోపలికి 12 నాటికల్ మైళ్లు వరకు పోర్టు అభివృద్ధి పనులు చేపట్టవద్దని నేవీ అధికారులు కోరారు. దీంతో ప్రభుత్వం దీనికి అంగీకరించి.. ఇప్పటికే పోర్టు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నేవీ సూచించిన పరిధిలో పోర్టు అభివృద్ది పనులు నిలిపివేయాలని సూచించారు. మరోసారి నేవీ అధికారులు ఎంత మేరకు స్థలం అవసరం అన్నదానిపై సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం రాంబిల్లిలో నేవీ ఏ విధమైన కార్యకలాపాలు కొనసాగించాలనుకుంటుంది అన్నదానిపై స్పష్టత రానుంది.
వాస్తవానికి విశాఖ తీర ప్రాంతం నేవీ కార్యకలాపాలకు అనుకూలం. అదేవిధంగా అక్కడ సరకు రవాణా, పోర్టు కార్యకలాపాలకు సౌకర్యవంతంగా కూడా ఉంది. అయితే ఆ ప్రాంతంలో పర్యాటకుల రద్దీ కావచ్చు లేదా స్థలం సరిపోకపోవడంతో మరో ప్రత్యమ్నాయ తీర ప్రాంతం కోసం నేవీ అధికారులు గత కొంతకాలంగా తీవ్రంగా గాలిస్తున్నారు. ఈక్రమంలో అనకాపల్లి వద్ద ఉన్న రాంబిల్లి పోర్టు.. విశాఖ పోర్టుకు సమీపంలో ఉండటంతో.. తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు దానిని ఎంచుకున్నట్లు నేవీ అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన కావడంతో త్వరలో రాంబిల్లి పోర్టు ప్రాంతం నుంచి నేవీకి మరో ప్రత్యమ్నాయ కేంద్రంగా మారనుంది.





