News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

239views

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న (శుక్రవారం) రోజున స్వామివారిని 61,265 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 27,078 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజు స్వామివారి హుండీ ఆదాయం 3.33 కోట్లు వచ్చింది. టికెట్‌ లేని సర్వదర్శనానికి 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.