
శబరిమల బంగారం దోపిడీపై విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా వుందని, అలాగే కేరళ రాష్ట్రంలోనే గాక, దీని మూలాలు ఇతర ప్రాంతాల్లోనూ వున్నాయని ఆరోపించారు.దీనికి సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
కేరళలోని సచివాలయ భవనం ముందు శబరిమల కర్మ సమితి ధర్నా నిర్వహించింది. ఇందులో అలోక్ కుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలోక్ కుమార్ మాట్లాడుతూ దేవస్వరం బోర్డు నుంచి ,దేవాలయ వ్యవస్థ నుంచి ప్రభుత్వం వెంటనే వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ బంగారం కేసు విషయంలో కేవలం కేరళ వ్యక్తులే కాకుండా, బయటి వ్యక్తుల ప్రమేయం కూడా వుందని, అలాగే ప్రభుత్వాధికారులు, ముఖ్యమంత్రి, ఆయన పార్టీయే కాకుండా, కర్నాటకలో పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలు, వ్యాపారులు, స్మగ్లింగ్ ముఠా ప్రమేయం కూడా వుందని ఆరోపించారు. ‘‘ఈ కేసును స్థానిక పోలీసులు లేదా సిట్ తో దర్యాప్తు చేసే విషయం కాదు. అవి అవినీతి వెనుక, నేరం వెనుక చాలా పెద్ద నెట్ వర్క్ వుంది. అది చాలా విస్తృతమైంది. శక్తిమంతమైంది. అందుకే శబరిమల బంగారం అవినీతి కేసులో అసలైన నిందితులను గుర్తించడానికి సీబీఐకి అప్పగించాలి’’ అని డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి హిందూ ఐక్యవేది నాయకురాలు మరియు శబరిమల కర్మ సమితి చైర్‌పర్సన్ కె.పి. శశికళ టీచర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల ప్రమేయం లేకుండా బంగారం అవినీతి జరగదని, అసలు రవాణాయే కాదని అన్నారు. “బంగారం అక్రమ రవాణా చేయబడి ఉంటే, ప్రభుత్వం మరియు రాజకీయ నాయకత్వం యొక్క బలమైన మద్దతు లేకుండా అది జరిగేది కాదు” అని తేల్చి చెప్పారు.





