
265views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఒక బార్‌లో నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖ నటి సన్నీ లియోన్ పాల్గొనాల్సి ఉండగా సాధువుల అభ్యంతరాలతో చివరిక్షణంలో రద్దయింది. అశ్లీలతను ప్రోత్సహించేలా ఉండే ఆమె కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలమంది సాధువులు మంగళవారం నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్‌కు ‘శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్’ వినతిపత్రం అందజేసింది. ఒకవేళ నిర్వాహకులు ముందుకువెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు నటిపై ఫిర్యాదు చేస్తామన్నారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన పవిత్ర ప్రదేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సమంజసం కాదని స్థానిక సాధువుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.





