News

హిందూ ధర్మంపై దాడులను సమైక్యంగా ఎదుర్కొందాం

206views

హిందువులు సమైక్యంగా వ్యవహరించి దేశంలో సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలని శృంగేరి విరూపాక్ష పీఠాధి పతి పర శివానంద భారతీ స్వామి (బాలస్వామి) ఉద్బోధించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ ఎస్) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దాని పోరాటపటిమను సింహావలోకనం చేసుకుంటూ భవిష్యత్తు సాధన మార్గాన్ని దర్శిస్తూ గుంటూరు ఆదిత్యనగర్ లోని సాయి మందిరంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళంలో ఆయన అనుగ్రహభాషణం చేశారు.

వందల ఏళ్ల నుంచి దేశంలో హిందూ సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయని, ఇటీ వల అవి మరింత పెచ్చుమీరుతున్నాయని పర శివానంద భారతీ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కులాలకు అతీతంగా హిందూ బంధువులంతా ఏకమై, సమైక్యంగా ఉద్యమించి వీటిని ఎదుర్కొవాలని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మధుమేహ వైద్యనిపుణులు, ఆర్ఎస్ఎస్ ప్రాంత సద్భావన ప్రముఖ్ డాక్టర్ కల్లగంటి నాగార్జున, చైల్డ్ సైకాలజిస్ట్ ప్రీతి, హిందూ చైతన్యవేదిక ప్రతినిధి నారాయణ శేషుబాబు, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ నాగరా జు తదితరులు పాల్గొన్నారు